Ghup Chup Ganesha'గప్ చుప్ గణేశా' ట్రైలర్ ..
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:49 PM
రోహన్, రిదా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'గప్ చుప్ గణేశా'. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రూపొందిస్తున్నారు.
రోహన్ (Rohan), రిదా (Rida) జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'గప్ చుప్ గణేశా' (gupchup Ganesha). కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రూపొందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ 'గప్ చుప్ గణేశా చాలా బాగుంది. ప్రేక్షకులకు చాలా క్యాచీ టైటిల్ ను చిత్ర బృందం అందించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నా చేత ఫస్ట్ లుక్, టైలర్ లాంచ్ చేయించిన ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. గతంలో ఈ బ్యానర్ పై 'రిచ్చి గాడి పెళ్లి' అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అన్నారు
దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ 'ఒక మొహమాటస్తుడు అయిన వ్యక్తి తన మొహమాటం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతాడో హాస్యపరంగా చూపిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు యువతను కట్టిపడేస్తాయి. ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని అన్నారు