Ghaati: రిలీజ్ డేట్ చెప్పేసిన స్వీటీ.. ఎప్పుడొస్తుందంటే.. ?

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:56 PM

ఇక రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ ఈ మధ్యనే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టింది. అందులో ఒకటి ఘాటీ(Ghaati).

Ghaati Release Date

లేడీ సూపర్ స్టార్ అనుష్క(Anushka) గత కొంతకాలంగా చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. సైజ్ జీరో తరువాత బరువు పెరిగిన అనుష్క..  మునుపటి రూపానికి రాలేకపోయింది.  అలా సినిమాలు చేస్తూనే కొద్దీ కొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. ఇక రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ ఈ మధ్యనే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టింది. అందులో ఒకటి ఘాటీ(Ghaati). 

స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్సకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసమే క్రిష్.. హరిహర వీరమల్లును సగంలోనే ఆపేశాడు. ఇక టీజర్ లో అనుష్క  రక్తపాతం చూసాక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అన్ని బావుండి ఉంటే ఘాటీ రిలీజ్ అయ్యి నెల దాటిపోయేది. ఏప్రిల్ 18 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్ని కారణాల వలన ఘాటీ వాయిదా పడింది. కొన్నిరోజుల నుంచి ఘాటీ జూలై 11 న రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. అందరూ అనుకుంటున్నట్లే జూలై 11 న ఘాటీ రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

పోస్టర్ లో అనుష్క, విక్రమ్ ప్రభు.. ఏవో మూటలను సముద్రం దాటిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. రిలీజ్ డేట్ ఎప్పుడు వచ్చినా స్వీటీ సినిమా అంటే.. ముందు ఉంటామని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  పెడుతున్నారు. మరి ఈ సినిమాతో స్వీటీ  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Updated Date - Jun 02 , 2025 | 04:03 PM