A Cup of tea: యంగ్‌స్టర్ జర్నీ.. 'ఎ కప్ ఆఫ్ టీ`
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:59 PM
'గీతా సుబ్రమణ్యం' (Geetha subramanyam)ఫేమ్ మనోజ్ కృష్ణ (manoj Krishna) తన్నీరు హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఎ కప్ ఆఫ్ టీ` (A Cup of tea) . నేటి యువతకు నచ్చే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజర్స్, నిఖిత రావు దర్శకులుగా పరిచయమవుతున్నారు.
'గీతా సుబ్రమణ్యం' (Geetha subramanyam)ఫేమ్ మనోజ్ కృష్ణ (manoj Krishna) తన్నీరు హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఎ కప్ ఆఫ్ టీ` (A Cup of tea) . నేటి యువతకు నచ్చే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజర్స్, నిఖిత రావు దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేషన్స్ పతాకంపై మనోజ్ కృష్ణ, నవీన్ కృష్ణ నిర్మించారు. జయ శ్రీ కథానాయిక. శనివారం సినిమా నుంచి వాట్ హాపెండ్ అనే ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ 'ఒక యంగ్‌స్టర్ జర్నీ..ఈ సినిమా. కాలేజ్ యువత జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది..అది ఎలా డీవియేట్ అవుతుంది దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అన్నది ఈ సినిమాలో చూపించాం. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా. డైరెక్టర్ ఎఫ్పీ రోజర్స్ గారు వచ్చి ఈ కథ చెప్పగానే చాలా నచ్చింది. గీత సుబ్రమణ్యం తర్వాత మళ్లీ నాకు అంత హై ఇచ్చిన ఫిల్మ్ ఇది. హీరోయిన్ జయత్రీ చాలా బాగా చేసింది. ఆమె క్యారెక్టర్ నేటి యువతకు తప్పకుండా నచ్చుతుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేము ఎంచుకున్న మార్గమే ఈ ప్రమోషనల్ సాంగ్. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నది ఈ పాటలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాం' అన్నాడు.
నటుడు రాకేష్ మాట్లాడుతూ 'నేను మనోజ్‌కి చాలా పెద్ద ఫ్యాన్.. గీత సుబ్రమణ్యం సిరీస్ టైమ్‌లో తన క్రేజ్ ఏంటో..ఏ రేంజ్లో ఉండేవాడో నాకు తెలుసు..ఆ టైమ్‌లో తనకి చాలా ఆఫర్స్ వచ్చేవి..అప్పుడే నువ్వు సినిమా చేస్తే నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వు అని అడిగాను.. ఒక ఆర్టిస్ట్‌గా ఈ సమాజానికి మంచి చేయాలనే ఈ కథ ఎంచుకున్నాడు. ఎలాంటి వల్గారిటీ లేని ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ..ఈ కథలో తనతో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్..ఈ పాత్ర నాకు రావడానికి కారణమైన మనోజ్ కి థ్యాంక్స్' అని అన్నారు.