scorecardresearch

Gandhi Thata Chettu: పుష్ప నచ్చకపోతే ఈ సినిమా మీకోసమే..

ABN , Publish Date - Jan 17 , 2025 | 02:55 PM

Gandhi Thata Chettu: " 'పుష్ప' క్యారెక్టర్ 95% అభిమానులకు నచ్చింది. ఒక 5% మంది మాత్రమే విమర్శకులు చేశారు. అయితే మెసేజ్ లేదు, స్మగ్లర్ అంటూ బాధపడినవారు..

Gandhi Thata Chettu: పుష్ప నచ్చకపోతే ఈ సినిమా మీకోసమే..
Ravishankar about Gandhi Thata Chettu and Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై పలు రాజకీయనాయకులు, ఇతరులు కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. ఒక స్మగ్లింగ్ చేసే గుండా హీరో ఏంటి? దీని ద్వారా సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారిని ఉద్దేశించి మైత్రీ ప్రొడ్యూసర్ రవి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..


సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాంధీ తాత చెట్టు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ రవి శంకర్ మాట్లాడుతూ.. పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పుష్ప' క్యారెక్టర్ 95% అభిమానులకు నచ్చింది. ఒక 5% మంది మాత్రమే విమర్శకులు చేశారు. అయితే మెసేజ్ లేదు, స్మగ్లర్ అంటూ బాధపడినవారు 'గాంధీ తాత చెట్టు' బాగా ఎంజాయ్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చాడు.


సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘మా సుకృతికి పాడటం చాలా ఇష్టం. నటనపై మాత్రం అంత ఆసక్తి లేదు. అలాంటిది ఈ చిత్ర సెట్లో తన నటన చూసి చాలా షాక్‌ అయ్యా. అంత చక్కగా యాక్ట్‌ చేసింది. సుకృతికి ఇది మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అలాగే దర్శకురాలు పద్మ ఈ స్క్రిప్ట్ ను చాలా అద్భుతంగా రాసుకుంది. తను కథ చెప్పిన విధానం వినే.. దీన్ని బాగా తెరకెక్కించగలదని నమ్మకం కలిగింది. నేను నమ్మినట్లుగా ఈ చిత్రాన్ని ఆమె చాలా తక్కువ సమయంలో ఎంతో అందంగా తెరకెక్కించింది. కచ్చితంగా తను భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటుంది’’ అన్నారు.


‘గాంధీ తాత చెట్టు’ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 02:59 PM