నాలుగు భాషల్లో గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌

ABN , Publish Date - Jul 10 , 2025 | 06:01 AM

నలంద విశ్వవిద్యాలయం నేపథ్యంలో భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’. మలయాళ దర్శకుడు సిధిన్‌...

నలంద విశ్వవిద్యాలయం నేపథ్యంలో భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’. మలయాళ దర్శకుడు సిధిన్‌ తెరకెక్కించారు. సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ హీరోగా నటిస్తూ, మీనా చాబ్రియాతో కలసి నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘కొందరు అసాధారణ వ్యక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు చెప్పారు.

Updated Date - Jul 10 , 2025 | 06:01 AM