Game Changer: స్టైల్ మార్చిన శంకర్.. సక్సెస్ అవుతారా
ABN , Publish Date - Jan 03 , 2025 | 07:18 PM
Game Changer: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పబ్లిసిటీ లో టాప్ ప్లేస్ లో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం బాలకృష్ణ డాకూ మహరాజ్ తో వస్తున్నారు. అయితే సంక్రాంతి సీజన్ లో ముందు విడుదలవుతోన్న గేమ్ ఛేంజర్ పై 'పుష్ప 2' ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది.
శంకర్ సినిమా అనగానే గ్రాండియర్.. ఆయన సినిమాల ప్రమోషనల్ కంటెంట్ లో కూడా దాన్నే ఎక్కువగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. కానీ.. తొలిసారి తెలుగు సినిమా తీసిన శంకర్.. తన తీరు మార్చుకున్నారు. తాజాగా రిలీజైన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ శంకర్ గత చిత్రాలకు భిన్నంగా ఉంది.
ఇది ఒక ఐఎఎస్ కు పొలిటిషయన్ కు మధ్య జరిగే కథ అని శంకర్ చెప్పినట్లే.. ట్రైలర్ లో కథను కథనాన్ని కొంత మేర రివీల్ చేసేశారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు నెటిజెన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ మాత్రమే రాగా.. ట్రైలర్ కు మాత్రమే కాస్త పాజిటివ్ రిపోర్ట్ లభిస్తోంది. శంకర్ చెప్పినట్లు కొత్త కొత్త షాట్స్.. సాంగ్స్ లో ప్రయోగాలు ట్రైలర్ లో అలా శాంపిల్ గా చూపించారు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవటం వలన.. గేమ్ ఛేంజర్ పై ఆడియన్స్ లో ఎలాంటి అంచానాలు లేవు. ఇప్పుడు విడుదలకు ముందు కాస్తో కూస్తో ట్రైలర్ హైప్ ను క్రియేట్ చేసింది. మరీ సినిమా ఏ మేరకు అంచానాలు అందుకుంటుందో చూడాలి.
మరోపక్క వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పబ్లిసిటీ లో టాప్ ప్లేస్ లో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం బాలకృష్ణ డాకూ మహరాజ్ తో వస్తున్నారు. అయితే సంక్రాంతి సీజన్ లో ముందు విడుదలవుతోన్న గేమ్ ఛేంజర్ పై 'పుష్ప 2' ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. అంత మాస్ సినిమాను చూసిన ఆడియన్స్ ను మెప్పించాలంటే గేమ్ ఛేంజర్ లో కూడా అంతకమించిన యాక్షన్ ఎలివేషన్ కంటెంట్ ఉండాల్సిందే. ట్రైలర్ చూశాక సినిమాలో వాటికి లోటు లేదన్న విషయం స్పష్టమవుతోంది. పెద్దగా అంచానలు లేకపోవటం కూడా గేమ్ ఛేంజర్ కు అడ్వాండెజ్ అవుతుందా? 2025 లో విడుదలవుతోన్న ఈ బిగ్ మూవీ టాలీవుడ్ కు సక్సెస్ ఫుల్ స్టార్ట్ ను అందిస్తుందా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.