Game Changer: నిశ్చితార్థం అయిన అమ్మాయిని దాచినట్లు సినిమాని దాచారు

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:55 PM

సినీ అభిమానులు ఎంతోగా వెయిట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల క్రేజీ పాన్ ఇండియన్ మూవీ 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Game Changer Trailer Launch Event Live

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ AMB మాల్‌లో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్పెషల్ గెస్ట్‌గా హాజరు అయ్యారు. అలాగే ఈ సినిమా కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ పాల్గొని స్పీచ్‌లు ఇచ్చారు. ఎవరెవరు ఏం అన్నారంటే..


వచ్చేది సంక్రాంతి కాదు శంక్రాంతి.. అద్భుతమైన సినిమాకు నేను వర్క్ చేశాను. గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ రాసిపెట్టుకొండి.

డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా

రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే తో వర్క్ చేశాను. ఈ సినిమాలో చూసినపుడు నటుడిగా ఎక్కడికో ఎదిగిపొయాడు. ఈ సినిమాలో నా పాత్ర మా నాన్న ను గుర్తుచేసింది.

హీరో శ్రీకాంత్

నా కెరీర్ లో ఉత్తమమైన పాత్రను ఈ సినిమాలో చేశాను.

అంజలి

గత కొన్ని సంక్రాంతి సినిమాల్లో నేను నటిస్తూ ఉన్నాను. రామ్ చరణ్ కు ఈ సినిమాలో బాబాయిగా నటిస్తున్నాను. చరణ్ నాకు బిడ్డలాంటి వాడనే ఫీలింగ్ కలుగుతుంది.

సముద్రగని

ఈ సినిమా గురించి నేను మాట్లాడను.. సినిమానే మాట్లాడతుంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావటం నాకు సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా నాకొక మొమరీ. చరణ్ గ్లోబుల్ స్టార్ అయ్యారు. కానీ ఎలాంటి ఆటిట్యూడ్ లేని వ్యక్తి..

ఎస్ జె సూర్య..

నిశ్చితార్థం అయిన అమ్మాయిని దాచినట్లు దిల్ రాజు మూడేళ్ల నుంచి గేమ్ చేంజర్ ను దాస్తూ వచ్చారు. శంకర్ గారి స్ట్రెయిట్ తెలుగు ఫిలిం కు నేను వర్క్ చేయటం గర్వంగా ఉంది. సినిమాలో ప్రతిపాత్ర గేమ్ ఛేంజర్ లాంటిదే. రాజమౌళి గారికి మా గేమ్ ఛేంజర్ టీమ్ తరపున SSMB సినిమాకు అల్ ది బెస్ట్..

తమన్

Updated Date - Jan 02 , 2025 | 06:19 PM