GAMA Awards 2025: ఆగస్ట్ 30న GAMA అవార్డ్స్ 

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:56 PM

ప్రతిష్టాత్మమైన GAMA అవార్డ్స్ కు టాలీవుడ్‌లో  స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు  అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా  ఈ ఏడాదికి సంబంధించి 5వ ఎడిషన్ వేడుకలు  ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది.




ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో  స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు  అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా  ఈ ఏడాదికి సంబంధించి 5వ ఎడిషన్ వేడుకలు  ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది. దుబాయ్ లో జరిగిన Keinfra Properties ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5వ  ఎడిషన్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను శనివారం లాంఛ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు  సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈ లోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆగస్టు 30న  టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న  ఎక్సలెన్స్ అవార్డ్స్  వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.


ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా,  ప్రియా హెగ్డే, శ్రీదేవి  స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు. ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్,  వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు.  టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్ కు ఈ అవార్డ్స్ ను అందించనున్నారు.  2024లో విడుదలైన చిత్రాల్లో నామినేటె అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు.  ఈ ఏడాది కూడా పలు పాపులర్ చిత్రాలు, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, టాప్ టెక్నీషియన్స్ గామా అవార్డులను అందుకోనున్నారు.
 

ఈ సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు గారు మాట్లాడుతూ ‘ దుబాయ్ లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న  జరగబోయే 5వ ఎడిషన్‌ను కూడా  మన తెలుగు వారు అందరూ , ఈ కార్యక్రమానికి సహకరించి, అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి’ అని అన్నారు. గామా అవార్డ్స్ 2025   జ్యూరీ చైర్ పర్సన్స్ గా   ఏ. కొదండ రామిరెడ్డి,  సంగీత దర్శకులు  కోటి,  సినీ దర్శకులు బి. గోపాల్  ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు  GAMA అవార్ద్స్  బహుకరించబడతాయి. 

Updated Date - Jun 23 , 2025 | 04:58 PM