Gadhadhari Hanuman: అలరించే గదాధారి
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:40 AM
పురాణగాథ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం గదాధారి హనుమాన్..
పురాణగాథ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గదాధారి హనుమాన్’. రవికిరణ్ కథానాయకుడు. రేణుకాప్రసాద్, బసవరాజ్ హురకడ్డి నిర్మించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ ‘హనుమంతుడు ఇచ్చిన శక్తితోనే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాం. పతాక సన్నివేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయి’ అని చెప్పారు. రేణుకా ప్రసాద్ మాట్లాడుతూ ‘రోహిత్ కొల్లి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. వినోద భరితంగా నడిపిస్తూనే భావోద్వేగాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు’ అని ప్రశంసించారు. రోహిత్‌కొల్లి మాట్లాడుతూ ‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. రవి జాయిన్ అవడంతో పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తున్నాం. రేణుకా ప్రసాద్ ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో నిర్మించేందుకు సహకరించారు. హనుమంతుని గదా శక్తిని చూపుతూ రూపొందించిన సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని చె ప్పారు.