Fly High Lyrical Video: గుణ‌శేఖ‌ర్ యూపోరియా.. నుంచి మ‌త్తెక్కించే సాంగ్‌

ABN , Publish Date - May 24 , 2025 | 10:20 PM

వైవిధ్యమైన చిత్రాలను భారీ స్థాయిలో రూపొందించే దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలమ్‌’ చిత్రం తర్వాత రూపొందిస్తున్న‌ కొత్త చిత్రం యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామా ‘యుఫోరియా’

euphoria

వైవిధ్యమైన చిత్రాలను భారీ స్థాయిలో రూపొందించే దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar). ‘శాకుంతలమ్‌’ చిత్రం తర్వాత రూపొందిస్తున్న‌ కొత్త చిత్రం యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామా ‘యుఫోరియా’ (Euphoria)రూపొందిస్తున్న విష‌యం తెలిసందే. భూమికా చావ్లా (Bhumika Chawla), సారా అర్జున్ (Sara Arjun), విగ్నేష్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, నాజ‌ర్‌, రోహిత్‌, లిఖిత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

షూటింగ్‌ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ఫ్లై హై (Fly High Lyrical Video) అంటూ సాగే ఓ లిరిక‌ల్ వీడియో గీతాన్ని శ‌నివారం విడుద‌ల చేశారు. కిట్టు విస్సా ప్ర‌గ‌డ (Kittu Vissapragada) సాహిత్యం అందించిన ఈ గేయాన్ని స్వీయ సంగీతంలో కాల‌భైర‌వ (Kaala Bhairava), పృథ్వీ చంద్ర (Prudhvi Chandra), గాయ‌త్రి న‌ట‌రాజ‌న్ (Gayathri Natarajan) తో క‌లిసి ఆల‌పించారు.

Updated Date - May 24 , 2025 | 10:20 PM