తొలి గీతం విడుదల

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:27 AM

సాత్విక్‌ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా భాను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో...

సాత్విక్‌ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా భాను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని మేకర్స్‌ ఆవిష్కరించారు. అదేవిధంగా ‘అరెరె’ అంటూ సాగే తొలి గీతాన్ని భీమ్స్‌ విడుదల చేశారు. సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యానికి సిద్ధార్థ్‌ సాలూర్‌ సంగీతం అందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు భాను మాట్లాడుతూ ‘మంచి ప్రేమ కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా అవుతుంది’ అని అన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 05:27 AM