హుషారైన గీతం

ABN , Publish Date - Jun 27 , 2025 | 01:21 AM

రజనీకాంత్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శ్రుతి హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

రజనీకాంత్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శ్రుతి హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ను డి.సురేశ్‌బాబు, సునీల్‌ నారంగ్‌, దిల్‌ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలవుతోంది. తాజాగా చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘చికిటు’ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ హుషారైన గీతంలో వింటేజ్‌ స్టైల్లో అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల్ని ఖుషీ చేశారు రజనీకాంత్‌.

Updated Date - Jun 27 , 2025 | 01:21 AM