R Narayanamoorthy: ఈ చదువులకేమైంది

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:30 AM

సమకాలీన సామాజక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆలోచింపజేసే చిత్రాలను తీసే నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి. ఆయన తాజా చిత్రం...

సమకాలీన సామాజక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆలోచింపజేసే చిత్రాలను తీసే నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి. ఆయన తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్‌ లీక్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నారాయణమూర్తి నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ‘కొన్నాళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్‌ లీకులు, గ్రూప్‌ - 1, 2 పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు చూస్తుంటే ఈ చదువులకేమైంది అనిపిస్తోంది. ఇలా జరుగుతుంటే విద్యార్థుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై పోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్లే ఇలా కుంభకోణాలు చేస్తూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిలా కొట్టుకుని నేలకు రాలుతున్నాయి. అందుకే విద్యను ప్రైవేట్‌ మాఫియా కంబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి. విద్యను జాతీయం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.. ఈ అంశాలనే మా సినిమాలో బలంగా చెప్పాం’ అన్నారు. ‘యూనివర్సిటీ’ చిత్రంలో వై.ఎస్‌. కృష్ణేశ్వరరావు, తిరుపతి నాయుడు, విజయకుమార్‌ సహా నూతన తారాగణం నటించారు.

Updated Date - Jul 11 , 2025 | 05:30 AM