NTR: పేషెంట్‌లా కనిపిస్తున్న తారక్.. అనారోగ్యంతో బాధపడుతున్నాడా
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:13 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కు ఏమైంది.. ? ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న ప్రశ్న. ఎన్టీఆర్ కు ఏమవ్వడం ఏంటి.. ? ఆయన బాగానే ఉన్నాడుగా అని అనుమానం రావచ్చు.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కు ఏమైంది.. ? ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న ప్రశ్న. ఎన్టీఆర్ కు ఏమవ్వడం ఏంటి.. ? ఆయన బాగానే ఉన్నాడుగా అని అనుమానం రావచ్చు. కానీ, గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్ ముఖంలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బాగా బక్కచిక్కి, ముఖంలో కళ తగ్గి పేషేంట్ లా కనిపిస్తున్నాడు. అదే అభిమానులను ఆందోళన చెందేలా చేస్తుంది. గతరాత్రి ఎన్టీఆర్.. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మరణవార్త విన్న తరువాత సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి రాలేకపోవడంతో.. అంత్యక్రియలు అనంతరం ఎన్టీఆర్.. కోట కుటుంబాన్ని కలిసి పరామర్శించాడు.
కోట ఆయనకు ఎంత ఆప్తుడో.. ఆయన లేని లోటు పరిశ్రమకు ఎంత ఉందో మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ లుక్ పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ ముఖం మారిపోయింది. అసలు ఒక పేషేంట్ లా తారక్ కనిపించడంతో ఆయనకు ఏమైందో అని ఆరాలు తీస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ ను మెయింటైన్ చేసే హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పుడు బరువు పెరిగి కనిపించిన తారక్.. ఆ తరువాత బరువు తగ్గి.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమా కోసం బరువు పెరిగిన తారక్.. ఆ తరువాత వార్ 2 కోసం బరువు తగ్గాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న తారక్.. ఇప్పుడు ఈ సినిమా కోసం ఈ లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ లుక్ అస్సలు బాలేదు. ప్రశాంత్ నీల్ హీరో అంటే కచ్చితంగా బరువు ఉండాలి. అందుకు తగ్గట్టే ఎలివేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి.. ఫిట్ నెస్ తో కనిపించాలి. కానీ, తారక్ బాడీ ఫిట్ గా కనిపించడం లేదు. నిద్రలేకుండా ఉన్నవారి ముఖం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు కనిపించింది కాదు.. కొన్నిరోజులుగా ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఇలా పేషేంట్ లానే కనిపిస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ ను అభిమానులు ఇలా చూడలేకపోతున్నారు. తారక్ ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా.. ? ఎందుకు ముఖం మొత్తం లోపలి పీక్కుపోయి.. చాలారోజుల నుంచి చికిత్స తీసుకుంటున్న పేషేంట్ లా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు బూరె బుగ్గలతో.. కళకళలాడే ఎన్టీఆర్.. ఇప్పుడిలా ఎండిపోయిన ముఖంతో కనిపించడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి.. ఎన్టీఆర్ కు ఏమైంది.. ? సినిమా కోసమే ఈ లుక్ నా.. ? లేక నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నాడా.. ? అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
Saroja Devi: ఆ కాంతి తరిగిపోదు... సరోజాదేవి కీర్తి కరిగిపోదు