Fake Voter Ids: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఆ స్టార్ హీరోయిన్ల పేర ఓట్లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:46 PM
టాలీవుడ్ హీరోయిన్లు (Tollywood heroines) సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్లు (Tollywood heroines) సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ముగ్గురి ఫేక్ ఓటర్ ఐడి (Fake voter ids) లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓటర్ల జాబితాలో ఈ హీరోయిన్ల పేర్లు కనబడటంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అధికారులు రూపొందించిన జాబితాలో నిజంగానే వీరి పేర్లు ఉన్నాయా? లేదా ఎవరైనా దురుద్దేశంతో ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేయడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పలు డివిజన్లలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. బీజేపీ అభ్యర్థిని బుధవారం ప్రకటించారు. లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.