Aspiring Artists Warning: ఆడిషన్ల పేరిట మోసాలను అడ్డుకోవాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:01 AM
రకరకాల పేర్లతో ఏర్పాటవుతున్న నకిలీ సినీ అసోషియేషన్లు ఆడిషన్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నాయి, సినీ ఇండస్ట్రీకి చెందిన యూనియన్‌లు అన్నీ ఏకతాటిపైకి...
రకరకాల పేర్లతో ఏర్పాటవుతున్న నకిలీ సినీ అసోషియేషన్లు ఆడిషన్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నాయి, సినీ ఇండస్ట్రీకి చెందిన యూనియన్‌లు అన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఇలాంటి మోసాలను అడ్డుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీ్‌పరాజా కోరారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సినీరంగం పట్ల ఆసక్తి ఉన్నవారు నిజమైన సినీ సంఘాలను సంప్రదించి, వారి ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాల’ని సూచించారు. ఏపీలో కొన్ని చోట్ల ఆడిషన్ల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూసేవాళ్లను అడ్డుకున్నామని తెలిపారు. ఎటువంటి అవగాహన లేకుండా కొందరు యూనియన్లు ఏర్పాటు చేసి చిన్న కళాకారులు, టెక్నీషియన్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారనీ దీనిపై చిత్ర పరిశ్రమ పెద్దలు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వ్యవస్థాపకులు అంబటి మధుమోహన్ కృష్ణ కోరారు.