Dhandora: సినిమా చూసి.. ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతారు
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:21 AM
‘దండోరా’ టైటిల్ వినగానే ఎన్నో ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కానీ, సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతారు.
‘దండోరా’ (Dhandoraa) టైటిల్ వినగానే ఎన్నో ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కథ అలా ఉంటుందా? ఇలా ఉంటుందా? దర్శకుడు ఈ పాయింట్‌నే చెబుతున్నాడా? అని ఎవరికి వారు ఊహించుకుంటారు. కానీ, సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతారు.
ఈ చిత్రంలోని స్క్రీన్‌ప్లే అంత అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు దర్శకుడు మురళీకాంత్. శివాజీ(Shivaji), నవదీప్ (Navdeep), నందు (Nandu) ప్రధాన పాత్రధారులుగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా మురళీకాంత్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.‘గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల్ని పూడ్చేందుకు కులాల వారీగా, మతాల వారీగా కొంత మందికి భూమిని కేటాయిస్తారనే విషయం నాకు అంతగా తెలియదు. నాకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథను రాసుకున్నాను.
మలయాళంలో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తాయని అంటుంటారు. మన దగ్గర ఎందుకు రావు? అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. ఈ చిత్రంలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. పాత్రలన్నీ శివాజీ క్యారెక్టర్‌తో లింక్ అయి ఉంటాయి. బిందు మాధవి (Bindu Madhavi) శక్తిమంతమైన మహిళ పాత్రలో కనిపిస్తారు’ అని అన్నారు.