The Girlfriend: రష్మిక.. ఏం జరుగుతుంది! లిరికల్ వీడియో వచ్చేసింది
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:51 AM
*రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం నుంచి మంగళవారం ఏం జరుగుతోంది అనే పాటను విడుదల చేశారు.
రష్మిక మందన్న (Rashmika Mandanna), దీక్షిత్ షెట్టి (Dheekshith Shetty) జంటగా రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend). గీతా ఆర్ట్స్ (Geetha Arts) ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్‌మెంట్ (Dheeraj Mogilineni Entertainment) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన నదివే అనే సాంగ్ మంచి ఆదరణ దక్కించుకోగా సొషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మంగళవారం ఈ చిత్రం నుంచి ఏం జరుగుతోంది ( Em Jaruguthondhi) అంటూ సాగే పాటను విడుదల చేశారు. రాకేందు మౌళి (Rakendu Mouli ) ఈ పాటకు సాహిత్యం అందించగా హేషమ్ అబ్డుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీతంలో చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఆలపించింది. పాట వింటున్నంత సేపు మెలోడియస్‌గా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది.
హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో కలకలము కలగలిపిన కథ మొదలా.. కలవరమున తెగ నలిగిన నిజము కలా.. తడబడినా తప్పటడుగా మతి చెడెనా ఏమో అంటూ పాట సాగుతూ హీరో , హీరోయిన్ల మధ్య రిలేషన్, బాండింగ్‌ను చూయించారు. ఈ క్రమంలో వచ్చే సాహిత్యం సైతం కొత్తగా ఉండి శ్రోతలకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంది. ఇంతకుముందు వచ్చిన నదివే పాట మాదిరి ఈ గీతం కూడా చార్ట్‌బస్టర్‌లో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీక్షిత్, రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా బావుంది. అయితే పాట ఆరంభమే.. ఏం జరుగుతోంది అంటూ సింగర్ హేషమ్ పలకడంలో కాస్త తప్పు దొర్లినట్లు అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనే పదాలు సాగదీసినట్లుగా వినిపిస్తోంది.