నటి ముచ్చెర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 06:06 AM
ప్రముఖ నటి ‘సీతాకోక చిలుక’ ఫేమ్ ముచ్చెర్ల అరుణ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. అరుణ భర్త మోహన్ గుప్తా..
ప్రముఖ నటి ‘సీతాకోక చిలుక’ ఫేమ్ ముచ్చెర్ల అరుణ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. అరుణ భర్త మోహన్ గుప్తా పారిశ్రామికవేత్త. గృహసముదాయ అలంకరణల సేవలందించే (ఇంటీరియర్ డిజైనింగ్) సంస్థను నడుపుతున్నారు. మోహన్ గుప్తా నడుపుతున్న సంస్థలో ఇటీవల అక్రమ నగదు బట్వాడాలు అధికస్థాయిలో జరిగాయని ఫిర్యాదులు రావటంతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం చెన్నై నీలాంగరైలోని వారి ఇంట్లో, కార్యాలయాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
చెన్నై (ఆంధ్రజ్యోతి)