Virgin Boys: వర్జిన్ బాయ్స్.. నుంచి మరో బోల్డ్ సాంగ్
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:56 PM
కుర్రకారును టార్గెట్ చేస్తూ పూర్తి బోల్డ్ జానర్లో తెరకకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం వర్జిన్ బాయ్స్
కుర్రకారును టార్గెట్ చేస్తూ పూర్తి బోల్డ్ జానర్లో తెరకకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం వర్జిన్ బాయ్స్ (Virgin Boys). ప్రస్తుతం సమాజంలో యువతీ యువకుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ గురించి వివరిస్తూ ఇండియాస్ మోస్ట్ డేరింగ్ రామ్కామ్ మూవీగా దయానంద్ (Dayanand) దర్శకత్వంలో రాజా దరపునేని (Raja Darapuneni) నిర్మించారు. గీతానంద్ (Geethanand), మిత్రాశర్మ (Mitraaw Sharma), శ్రీహన్, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇటీవలే విడుదల చేసిన టీజర్, పాటలు యూత్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా బుధవారం మరో ఈవెంట్ నిర్వహించి సినిమా నుంచి డమ్ డమ్ డిగా డిగా అంటూ సాగే మరో క్లబ్, పబ్ రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ప్రణవ్ చాగంటి సాహిత్యం అందించిన ఈ పాటను యాసిర్ నిజార్ ఆలపించగా సమ్రాన్ సాయి సంగీతం అందించారు. అయితే ఈ గీతంలో సైతం గత పాటలానే అర్థనగ్న దృశ్యాలు, ముద్దులు, తాగుడు సన్నివేశాలతోనే నింపేశారు.