Multilingual Film: తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్ర నిర్మాణం
ABN , Publish Date - Jun 14 , 2025 | 06:03 AM
దుల్కర్ సల్మాన్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైందని, తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నామని నిర్మాత సురేశ్‌బాబు తెలిపారు. వీటిల్లో వెంకటేశ్, రానా నటించే చిత్రాలు కూడా ఉన్నాయన్నారు.
దుల్కర్ సల్మాన్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైందని, తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నామని నిర్మాత సురేశ్‌బాబు తెలిపారు. వీటిల్లో వెంకటేశ్, రానా నటించే చిత్రాలు కూడా ఉన్నాయన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తమ బ్యానర్‌లో తెలుగు, హిందీ, తమిళంలో పలు సినిమాల షూటింగులు జరుగుతున్నాయన్నారు. త్వరలో మనోజ్ బాజ్‌పాయ్‌తో హిందీలో ఓ సినిమా నిర్మించనున్నట్లు చెప్పారు. శోభితతో చిత్రీకరించిన ఓ షోను కూడా అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందన్నారు.
-తిరుమల (ఆంధ్రజ్యోతి)