Dulquer Salmaan on Loka Chapter 1: నేను చేసిందల్లా వారికి స్వేచ్ఛనివ్వడమే
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:56 AM
ప్రతిభావంతులైన నటీనటులు, గొప్ప సాంకేతిక నిపుణుల పనితనంతోనే లోక ఛాప్టర్ 1 చంద్ర లాంటి మంచి చిత్రాన్ని నిర్మించగలిగాం...
ప్రతిభావంతులైన నటీనటులు, గొప్ప సాంకేతిక నిపుణుల పనితనంతోనే ‘లోక-ఛాప్టర్ 1: చంద్ర’ లాంటి మంచి చిత్రాన్ని నిర్మించగలిగాం. నిర్మాతగా నేను చేసిందల్లా వారికి స్వేచ్ఛనివ్వడమే. ఒక్కసారి మాత్రమే షూటింగ్‌కు వెళ్లాను అంటే నేను వారిని ఎంతలా నమ్మానో మీరు అర్థం చేసుకోవచ్చు’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. ఆయన నిర్మాతగా డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘మలయాళంలో ఓ చిన్న సినిమా చేస్తున్నాను’ అని కల్యాణి ప్రియదర్శన్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి మంచి ఆదరణతో కొనసాగుతోంది. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పారు. ‘ఒక సూపర్‌హిట్ సినిమాను తెలుగులో విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ‘కొత్తలోక’ చిత్రాన్ని తెలుగు సినిమాలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాను అని కల్యాణి ప్రియదర్శన్ అన్నారు. మా సినిమాకు ఈ స్థాయి స్పందనను ఊహించలేదు, ప్రేక్షకాదరణకు చాలా సంతోషంగా ఉందని డొమినిక్ అరుణ్ తెలిపారు.