Gaddar Awards: సీఎం రేవంత్‌ను కలసిన దుల్కర్‌ సల్మాన్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:18 AM

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకల్లో ‘లక్కీ భాస్కర్‌’ చిత్రానికి గాను...

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకల్లో ‘లక్కీ భాస్కర్‌’ చిత్రానికి గాను దుల్కర్‌ను ఉత్తమ నటుడి పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అయితే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి దుల్కర్‌ హాజరు కాలేకపోయారు. ఆదివారం దుల్కర్‌ సల్మాన్‌ తన టీమ్‌తో కలసి సీఎం చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనతో పాటు నిర్మాతలు స్వప్న దత్‌, సుధాకర్‌ చెరుకూరి తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 05:18 AM