Dulquer Salmaan: దుల్కర్‌ కొత్త సినిమా

ABN , Publish Date - Aug 06 , 2025 | 02:30 AM

విలక్షణ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నూతన దర్శకుడు రవి నేలకుదిటితో ఓ సినిమా చేయబోతున్నారు

విలక్షణ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నూతన దర్శకుడు రవి నేలకుదిటితో ఓ సినిమా చేయబోతున్నారు. హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు హీరో నాని క్లాప్‌ కొట్టారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బేనర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు చిత్రబృందం తెలిపింది.

Updated Date - Aug 06 , 2025 | 02:30 AM