OG DOP: డీఓపీ మారినా...
ABN, Publish Date - May 13 , 2025 | 12:33 PM
పవర్ తుఫాన్ వచ్చేస్తోంది. వరుసగా వస్తున్న హెచ్చరికలు తీరం దాటేలా కనిపిస్తోంది. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అప్ డేట్స్ వచ్చినా తాజాగా బయటకు వచ్చిన ఓ క్రేజీ న్యూస్ సెన్సేషన్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), యంగ్ దర్శకుడు సుజీత్ (Sujeeth ) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ (OG). పవన్ గ్యాంగ్ స్టర్ అవతారంలో కనిపించనున్నాడని తెలిసి ఫ్యాన్స్ యమ ఖుషి అవుతున్నారు. సినిమా మొదలైనప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న 'ఓజీ'... పవన్ పాలిటిక్స్ వల్ల షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG) అంటూ టైటిల్, గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపిన మేకర్స్ మరో కత్తిలాంటి కబురు చెప్పడంతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి బయటకు వచ్చిన అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఓ వైపు అధికారిక కార్యక్రమాలు, మరోవైపు కమిట్ అయిన సినిమాలూ... ఈ రెండింటినీ బాలెన్స్ చేయాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారు. అలానే మొదలెట్టిన సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా 'హరిహర వీరమల్లు' ( Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్ ను పవన్ పూర్తి చేశారు. దీంతో ఇది జూన్ లో విడుదల కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్ కూడా రానుంది. పైగా వీరమల్లు ఓ కొలిక్కి రావడంతో... నెక్ట్స్ 'ఓజీ' పై ఫోకస్ పెట్టాడట పవన్ కల్యాణ్. ఈ మూవీని త్వరగా ముగించాలని ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా 'మళ్లీ మొదలైంది... ఈసారి ముగిద్దాం' అనే కాప్షన్ తో తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ షెడ్యూల్ దాదాపు 30 రోజులు జరిగేలా కనిపిస్తోంది. ఈ వారంలోనే పవన్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు.
ఎట్టకేలకు 'ఓజీ' షూటింగ్ మొదలు అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ మూవీ 1980-90 మధ్య జరిగే కథతో రాబోతోంది. షూటింగ్ తిరిగి అలా మొదలైందో లేదో... ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తన స్టైలిష్ విజువల్స్ తో మూవీలవర్స్ ను మాయ చేసే సినిమాటోగ్రఫర్ రవి కె చంద్రన్ ( Ravi K Chandran) ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మనోజ్ పరమహంస (Manoj Paramahamsa) ను మేకర్స్ తీసుకున్నారట. రవి కె చంద్రన్ తమిళ చిత్రం పరాశక్తి (Parasakthi) షూటింగ్ తో బిజీగా మారాడు. దీంతో ఆయన ప్లేస్ ను మనోజ్ తో రీప్లేస్ చేసినట్లు టాక్ నడుస్తోంది. మనోజ్ 'హరిహర వీరమల్లు' కూ పనిచేశారు. పైగా పవన్, త్రివిక్రమ్ (Trivikram)తో ఆయనకు మంచి అనుబంధంతో ఉండటంతో వర్క్ కూడా ఫాస్ట్ గా అవుతుందని భావిస్తున్నారట. మొత్తానికీ అందుబాటులో ఉన్న సాంకేతిక నిపుణులతో 'ఓజీ' షూటింగ్ ను శరవేగంగా ముగించే పనిలో సుజిత్, డీవీవీ దానయ్య ఉన్నట్టు అర్థమౌతోంది.