Dolby Cinema: అల్లు సినీప్లెక్స్‌, AMB కపాలీలో భారీ స్క్రీన్

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:59 PM

భారతీయ సినీ ప్రేక్షకులకు అత్యుత్తమ వీక్షణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో డాల్బీ సినిమా (Dolby Cinema) ఫార్మాట్ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది.

భారతీయ సినీ ప్రేక్షకులకు అత్యుత్తమ వీక్షణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో డాల్బీ సినిమా (Dolby Cinema) ఫార్మాట్ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. థియేట్రికల్ అనుభవంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రీమియం లార్జ్-ఫార్మాట్ () కాన్సెప్ట్... అత్యున్నత నాణ్యత గల డాల్బీ విజన్ (Dolby Vision) పిక్చర్, అద్భుతమైన సరౌండ్ సౌండ్ అందించే డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీలను ప్రత్యేకమైన ఆడిటోరియం డిజైన్‌ తో కలిపి అందిస్తోంది. ఈ ప్రత్యేకతలతో, డాల్బీ సినిమా ప్రస్తుతం ఐమాక్స్ (IMAX) వంటి ఫార్మాట్‌లకు గట్టి పోటీదారుగా నిలుస్తోంది.


డాల్బీ సినిమా విస్తరణలో భాగంగా, త్వరలో ప్రారంభం కానున్న ఎ.ఎం.బి కపాలీ మల్టీప్లెక్స్ (Kapali Multiplex)లో ఈ ప్రత్యేకమైన ఫీచర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఎ.ఎం.బి కపాలీలో మొత్తం తొమ్మిది అధునాతన స్క్రీన్‌లు ఉంటాయి. వీటిలో 60 అడుగుల వెడల్పు గల భారీ డాల్బీ సినిమా స్క్రీన్ ఒకటి ఏర్పాటు కానుంది. అత్యంత విశాలమైన ఈ 60 అడుగుల స్క్రీన్ దేశంలోనే రెండో అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.


డాల్బీ లేబొరేటరీస్
(Dolby Laboratories) ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం అంతటా ఆరు డాల్బీ సినిమా స్క్రీన్‌ లను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్రలోని పుణె (Pune)లో 'సిటీ ప్రైడ్' (City Pride)కర్ణాటక రాజధాని బెంగళూరు (Bangalore)లోని ఎ.ఎం.బి సినిమాస్ లో ఈ ఫార్మాట్‌ను విజయవంతంగా ప్రారంభించారు. అలానే రాబోయే డాల్బీ సినిమా లొకేషన్‌ ల జాబితాలో హైదరాబాద్  కూడా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న అల్లు సినీప్లెక్స్ (Allu Cineplex)లో త్వరలో డాల్బీ సినిమా స్క్రీన్ అందుబాటులోకి రానుంది. అలాగే  ట్రిచీలోని(Trichy) – ఎల్.ఎ సినిమా (L.A Cinema), కొచ్చి (Kochi) – ఈ.వీ.ఎం సినిమాస్ (EVM Cinemas), ఉలిక్కల్(Ulikkal)-జి సినీప్లెక్స్. 

మహేష్ బాబు కొత్త మల్టీప్లెక్స్ 'AMB క్లాసిక్'

ఇదిలావుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) భాగస్వామ్యంలో హైదరాబాద్‌లో తమ రెండవ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రకటించారు. 'ఎ.ఎం.బి క్లాసిక్' (AMB Classic)పేరుతో రానున్న ఈ ఏడు స్క్రీన్ల మల్టీప్లెక్స్ చారిత్రక ఆర్టీసీ క్రాస్ రోడ్స్  వద్ద కొలువుదీరనుంది. హైదరాబాద్‌లో వరుసగా అల్లు సినీప్లెక్స్, AMB క్లాసిక్ వంటి అత్యాధునిక థియేటర్లు రావడం... సినీ ప్రియులకు సాంకేతికంగా ఉన్నతమైన మరియు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించనుంది.

Updated Date - Dec 12 , 2025 | 04:05 PM