Divyabharathi: హద్దులు దాటాడు.. ఆ డైరెక్టర్ పై సుడిగాలి సుధీర్ హీరోయిన్ ఫైర్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:23 PM
కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి (Divyabharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటించి అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది.
Divyabharathi: కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి (Divyabharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటించి అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తెలుగులో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గోట్ (Goat) సినిమాలో నటిస్తోంది. ఇదే అమ్మడి మొదటి తెలుగు సినిమా. పాగల్ సినిమాతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నరేష్ కుప్పిలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది కానీ, నరేష్ టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ పేరును ఈ డైరెక్టర్ కాపాడుకోలేదని తెలుస్తోంది. పాగల్ తరువాత నరేష్.. సుడిగాలి సుధీర్ తో గోట్ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా సగం షూటింగ్ ఫినిష్ అయ్యాకా.. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో నిర్మాత - డైరెక్టర్ మధ్య విభేదాలు వచ్చి ఆగిపోయింది. ఇక తరువాత డైరెక్టర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాతనే డైరెక్టర్ గా మారి సినిమాను పూర్తిచేశాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఒడియమ్మ అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈలోపే ఈ సినిమా హీరోయిన్ దివ్యభారతి.. డైరెక్టర్ నరేష్ కుప్పిలిపై సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చింది. మహిళలను గౌరవించడం ఈ డైరెక్టర్ కు తెలియదు అని ఫైర్ అయ్యింది. అతను సుడిగాలి సుధీర్ పై చేసిన ఒక పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ తన గురించి వ్యంగ్యంగా మాట్లాడిన తీరును ఎండగట్టింది. 'ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు?.. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? స్టెప్పం కొట్టి డప్పం వేయనా? ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండుపై.." అంటూపోస్ట్ పెట్టాడు.
ఇక ఈ పోస్ట్ పై దివ్యభారతి మండిపడింది. 'స్త్రీలను చిలకా అని, లేదా మరేదైనా పేరుతో పిలవడం జోక్ కాదు, ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదిఒక్కటే కాదు, ఈ దర్శకుడు సెట్‌లో కూడా కూడా పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ ఉంటాడు. నిజాయితీగా చెప్పాలంటే తాను గర్వంగా చెప్పుకునే కళకే ద్రోహం చేశాడు. నన్ను ఇంకా బాధపెట్టింది ఏంటంటే హీరో సుడిగాలి సుధీర్ మౌనంగా ఉండటం. అలా మౌనంగా ఉంటే ఇలాంటి సంస్కృతిని అనుమతిస్తున్నట్లే. నేను బెటర్ సంస్కృతిని కోరుకుంటున్నాను. వర్క్ ప్లేస్ లో స్త్రీలను టార్గెట్ చేయని ప్లేస్ లను ఎంచుకుంటాను. ఎక్కడైతే మర్యాద ఉండదో అక్కడ ప్రతి ఒక్కరి గొంతు అవసరమే. ఇది కేవలం నా ఛాయిస్ మాత్రమే కాదు. ఒక నటిగా నా స్టాండర్డ్స్' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ చాలామంది ఈమెకు ప్రతి సినిమా టీమ్ తో వివాదాలే అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దానికి కూడా ఈ చిన్నది స్పందించింది.
' నాకు ప్రతిసారి.. ప్రతి టీమ్ తో సమస్యలు ఉన్నాయని చెప్పుకొనేవారు నిజాలను తెలుసుకోండి. నేను తమిళ సినిమాల్లో.. ఒకే టీమ్ తో, నటీనటులతో చాలా సినిమాలు చేశాను. అప్పుడు ఎటువంటి విభేదాలు లేవు. ఈ ఒక్క దర్శకుడు మాత్రమే హద్దులు దాటి అవమానించేలా మాట్లాడాడు. అంతేకాకుండా దానిని అందరి ముందు చెప్పాలని చూశాడు. దానిని ఖండిచే హక్కు నాకు ఉంది. మీరు ఇప్పటికీ అతనినే సమర్దించుకోవలంటే అది మీ ఇష్టం. దానికోసం నేనేమీ నిద్ర మానుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడనుకుంటే.. వారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది.