Sandeep Reddy Vanga: 'జిగ్రీస్' కోసం స్పిరిట్ డైరెక్టర్..

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:07 PM

చిన్న సినిమాలకు సహాయం చేయడంలో టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడు ముందే ఉంటారు. అల్లు అర్జున్ దగ్గరనుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వరకు కథ నచ్చితే వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు.

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: చిన్న సినిమాలకు సహాయం చేయడంలో టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడు ముందే ఉంటారు. అల్లు అర్జున్ దగ్గరనుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వరకు కథ నచ్చితే వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా.. ఒక చిన్న సినిమాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. మ్యాడ్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో రామ్ నితిన్ ఒక హీరోగా జిగ్రీస్ (Jigris) అనే సినిమా తెరకెక్కుతుంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా మిగతా ముగ్గురు హీరోలుగా నటిస్తున్నారు.


ఇక ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మ్యాడ్ సినిమా మాదిరిగానే ఫ్రెండ్స్, అల్లర్లు, కాలేజ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ కథ నచ్చడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాకు సహాయం చేస్తున్నాడు. తాజాగా ఆయన జిగ్రీస్ టీజర్ ను రిలీజ్ చేయనునట్లు మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 8 న జిగ్రీస్ టీజర్ ను సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయనున్నాడు.


డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ రిలీజ్ చేయనున్నాడని తెలియడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈ హైప్ తో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో బిజీగా మారాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో డార్లింగ్ సరసన త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ఇక మొట్ట మొదటిసారి ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Aug 06 , 2025 | 11:08 PM