Shashtipoorthi: ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా.. ఈ పాటే వినిపిస్తుంది!

ABN, Publish Date - May 18 , 2025 | 01:11 PM

రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లు గా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’.

nag ashwin

రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) కాంబినేషన్‌లో రూపేశ్ (Rupesh), ఆకాంక్ష సింగ్ (Akanksha Singh) హీరో హీరోయిన్లుగా పవన్‌ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్టిపూర్తి’(Shashtipoorthi). మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా (Ilaiyaraaja) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు మంచి ప్రాచుర్యం పొందాయి. ఈక్ర‌మంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘షష్టిపూర్తి’ నేపథ్యoలో సాగే ‘వేయి వేణువుల నాదం మోగే’ పాటను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) విడుదల చేసి యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పాట‌కు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించ‌గా.. కార్తీక్, విభావరి ఆప్టే జోషి ఆల‌పించారు. స్వర్ణ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు.

అనంత‌రం ఈ పాట గురించి దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన! ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన! సరాదలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవై లో ఇరవైలా విరిసిన వరమాల...’’ అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్ అద్బుతంగా రాశార‌ని, ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్న ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందేన్నారు. ఇళయరాజా గారి స‌మ‌క్షంలో ఈ పాట రికార్డింగ్ ని ప్రత్యక్షంగా వీక్షించి పులకించి పోయాన‌ని తెలిపారు.

ఈ పాట కోసం కళా దర్శకుడు తోట తరణి ఓ మండువ లోగిలిని అత్యద్భుతంగా తీర్చి దిద్దారని. నిజంగా ఓ పెళ్లి వేడుకలో ఉన్నపుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఈ పాట చూస్తున్నపుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన , మా రూపేష్, ఆకాంక్ష సింగ్ లు ఈ పాటలో నిజంగా జీవించారని, చాలా కాలం గుర్తుండి పోయే పాట ఇదని అన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:14 PM