Bad Girls Telugu Movie: వారి కథల స్ఫూర్తితో

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:44 AM

‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ మున్నా ధులిపూడి నుంచి వస్తోన్న మరో చిత్రం ‘బ్యాడ్‌ గర్ల్స్‌’. ‘కానీ చాలా మంచోళ్లు’ దీని ట్యాగ్‌లైన్‌...

‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ మున్నా ధులిపూడి నుంచి వస్తోన్న మరో చిత్రం ‘బ్యాడ్‌ గర్ల్స్‌’. ‘కానీ చాలా మంచోళ్లు’ దీని ట్యాగ్‌లైన్‌. అంచల్‌గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. సూర్య, మొయిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశిధర్‌ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి సినిమా తీయడం నిజంగా సాహసమే’ అని అన్నారు. చిత్ర దర్శకుడు మున్నా మాట్లాడుతూ ‘అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ, ఆ తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది అమ్మాయిల కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశాను’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇది కుటుంబ కథా చిత్రం. ప్రతి ఫ్యామిలీ చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుతున్నాం’ అని అన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 05:44 AM