Mahesh babu: ఉపేంద్ర పాత్ర కోసం దర్శకుడు ఏమన్నారంటే..

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:21 PM

రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. ఇందులో ఆయన అభిమాని పాత్రలో కనిపిస్తారు. మహేష్‌ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్రధారి.


రామ్‌ పోతినేని (Ram pothineni) హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ (andhra king Thaluka). ఇందులో ఆయన అభిమాని పాత్రలో కనిపిస్తారు. మహేష్‌ బాబు (mahesh babu)దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ స్టార్‌ ఉపేంద్ర (Upendra) కీలక పాత్రధారి. తాజాగా బెంగళూరులో కన్నడ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ఉపేంద్ర హాజరయ్యారు. అక్కడ జరిగిన విలేకర్ల సమావేశంలో దక్షిణాదిలో ఇంతమంది స్టార్స్‌ ఉండగా ‘ఆంధ్రాకింగ్‌’ పాత్రకు ఉపేంద్రనే ఎందుకు సెలెక్ట్‌ చేశారని దర్శకుడిని అడడగా  ‘కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం ఇలా  అన్ని పరిశ్రమల వారు ఉపేంద్రను మన మనిషి అని ఫీలవుతారు. ఆయనొక యునీక్‌ స్టార్‌.  అన్ని భాషల వారు ఆయన్ని తమ హీరోగానే భావిస్తారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్‌ పోషించడానికి, ఒకరకమైన ఫిలాసఫీ, అండర్‌ స్టాండింగ్‌ నేచర్‌ కావాలి. ఇతర స్టార్లు ఇలాంటి క్యారెక్టర్‌ చేస్తారని నేను అనుకోవడం లేదు’ అని మహేశ్‌ చెప్పారు.

అలాగే ఉపేంద్ర మాట్లాడుతూ ‘ఈ సినిమాని కథ, స్ర్కీన్‌ప్లే కోసం కాదు కేవలం సినిమా అభిమానుల కోసం చేశాను. సినిమా చూసిన తర్వాత సినిమాకి ఫ్యాన్‌ అయిపోయాను. సినిమాలో వున్న ఎమోషన్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. రామ్‌ నటన అసాధారణంగా ఉంటుంది. తెరపై చూస్తున్నపుడు రామ్‌ ఎనర్జీ కట్టిపడేస్తుంది’ అని అన్నారు.  

Updated Date - Nov 20 , 2025 | 04:23 PM