Balakrishna: బాలయ్యకు ఇష్టమైన తారక్ సినిమా ఏంటంటే..
ABN , Publish Date - Jan 08 , 2025 | 07:38 AM
Balakrishna: పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ, వాల్తేర్ వీరయ్య సినిమాల పోస్టర్లను ప్రదర్శించారు. కానీ.. బాబీ కెరీర్ లో ఎంతో కీలకమైన జూ. ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాని విస్మరించారు. దీంతో పలువురు పలు అనుమానులు వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు బాబీ క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవలే జరిగిన బాలకృష్ణ ఆన్‌స్టాపబుల్ షోలో ఉద్దేశపూర్వకంగానే తారక్ గురించి, తారక్ సినిమా ప్రస్తావన గురించి మాట్లాడలేదని చర్చ మొదలైంది. మరికొందరు అయితే ఏకంగా తారక్ ప్రస్తావన ఎడిటింగ్ లో తీసేశారని, నిర్వాహుకులు షోలో తారక్ ప్రస్తావన రాకుండా ఒప్పందం చేసుకున్నారని తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రచ్చపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దర్శకుడు బాబీ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే..
సంక్రాంతి పండుగని పురస్కరించుకొని జనవరి 12న బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్.. బాలకృష్ణ ఆన్‌స్టాపబుల్ షోకు అటెండ్ అయ్యారు. ఈ షోలో డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. నిర్వాహకులు పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ, వాల్తేర్ వీరయ్య సినిమాల పోస్టర్లను ప్రదర్శించారు. కానీ.. బాబీ కెరీర్ లో ఎంతో కీలకమైన జూ. ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాని విస్మరించారు. దీంతో పలువురు పలు అనుమానులు వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు బాబీ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. "మీరు అనుకున్నంత డ్రామా అక్కడ జరగలేదు, స్లయిడ్స్ లో చూపించిన ఫోటోల గురించి మాట్లాడుకున్నాం తప్పించి ఇంకే ఇతర ఉద్దేశం లేదు. బ్రేక్ టైంలో నాగవంశీ, బాలకృష్ణ మాట్లాడుకున్నప్పుడు తారక్ టాపిక్ వచ్చింది, అన్ని ఆన్ రికార్డు ఉండవు కాబట్టి మీకు ఆధారం చూపించలేము. అంతే కాదు బాలకృష్ణకు జై లవకుశ చాలా ఇష్టం, పలు సందర్భాల్లో నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారని" తెలిపాడు. దీంతో వివాదం తొలిగిపోయినట్లే అని కొందరు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.