Anil Ravipudi: ప్రభాస్ వ్యక్తిత్వం అలాంటింది..

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:01 PM

రాజు ఎక్కడున్నా రాజే.. ఈ ఒక్క మాట కేవలం ప్రభాస్ (Prabhas) కే వాడతారు. ఆయన మాట్లాడే పద్దతిలో అయినా.. ఉండే తీరులోనైనా.. పెట్టే భోజనంలో అయినా.. గుణంలో అయినా రాజు రాజే.

Anil Ravipudi

Anil Ravipudi: రాజు ఎక్కడున్నా రాజే.. ఈ ఒక్క మాట కేవలం ప్రభాస్ (Prabhas) కే వాడతారు. ఆయన మాట్లాడే పద్దతిలో అయినా.. ఉండే తీరులోనైనా.. పెట్టే భోజనంలో అయినా.. గుణంలో అయినా రాజు రాజే. ఇప్పటివరకు ప్రభాస్ పై ఒక్క వివాదం కూడా లేదు. ఇండస్ట్రీలో డార్లింగ్ అంత స్వీట్ పర్సన్ ఇంకెవరూ ఉండరు కూడా. చాలా సింపుల్ గా.. అతి తక్కువమంది స్నేహితులతో.. ఎక్కువగా మీడియా ముందుకు రాకుండా.. చేసిన మంచిని చెప్పుకోకుండా బ్రతకడం కేవలం డార్లింగ్ కే చెల్లింది.

ఇండస్ట్రీలో చాలామంది ప్రభాస్ వ్యక్తిత్వానికి ముగ్దులు అయ్యామని చెప్పుకొచ్చారు. ఇక ఆ లిస్ట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చేరాడు. ఈ మధ్య జరిగిన ది రాజాసాబ్ ఈవెంట్ లో ప్రభాస్ సీనియర్లు సీనియర్లే.. వారి తరువాతే మేము. వారు మాకు నేర్పిందే.. ముందు సీనియర్ల సినిమాలు.. ఆ తరువాతే మావి. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. మాది కూడా హిట్ అయితే హ్యాపీ అని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.

సాధారణంగా ఇలా ఏ హీరో మాట్లాడలేడు. ముందు మాది, ఆ తరువాతనే వేరొకరిది అని చెప్పుకొస్తారు. అందరి సినిమాలు ఆడాలి అని చెప్పేస్తారు. కానీ, ముందు వారు తరువాతనే మేము అని తగ్గి మాట్లాడడం.. అది కూడా పాన్ ఇండియా స్థాయి హీరో ఇలా మాట్లాడడం అనేది అస్సలు జరగదు. కానీ, డార్లింగ్ మాట్లాడాడు. ఇక డార్లింగ్ వ్యాఖ్యలపై అనిల్ రావిపూడి స్పందించాడు. అది ప్రభాస్ వ్యక్తిత్వమని, అందుకే ఆయనను డార్లింగ్ అంటారని చెప్పుకొచ్చాడు.

' అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా ప్రభాస్ వ్యక్తిత్వం. ఆయన ఉన్న స్థాయికి, స్టేటస్ కి సీనియర్స్ తరువాతే మేము అని అనడం నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్. ఆయన నేచర్.. ఆయన హ్యుమానిటీ అలా ఉన్నాయి కాబట్టే ప్రభాస్ ఆ స్థాయిలో ఉన్నాడు. కచ్చితంగా ది రాజా సాబ్ ప్రీమియర్స్ కి మా టీమ్ తో వెళ్లి ఆ సినిమాను మేము సెలబ్రేట్ చేసుకుంటాం' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Dec 30 , 2025 | 06:30 PM