Kingdom: అయోమయంలో కింగ్ డమ్

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:27 PM

ఆస‌లే ప్లాఫులు వెంటాడుతున్నాయి. ఒక్క హిట్‌తో అంతా సెట్ చేద్దాం అనుకుంటే ఆ యంగ్ హీరోను స‌మ‌స్య‌లు వ‌ద‌ల‌డం లేదు. బాక్సాఫీస్ రేసుకు అన్నీ రెడీ చేసుకునే టైమ్‌లో మ‌ళ్లీ బ్యాక్ స్టెప్ వేయాల్సి వ‌స్తోంది.

ప్రెజెంట్ డూ ఆర్ డై సిట్యువేష‌న్‌లో ఉన్నాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ‌ (Vijay Deverakonda). గ‌త సినిమాలు ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో అప్ క‌మింగ్ మూవీ 'కింగ్‌డమ్‌' (Kingdom) పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ రీలీజ్‌కు రెడీ అవ్వొచ్చు అనుకునే స‌మ‌యంలో ఈ సినిమాని అవాంత‌రాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా వాయిదా స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది.


' కింగ్ డ‌మ్' రిలీజ్ మొదట సమ్మర్‌లో అని చెప్పారు. ఆ త‌ర్వాత జూలై 4కి మార్చారు. కానీ అది కూడా జ‌రిగేలా లేదు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri ) టీమ్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించింది. కానీ లెంగ్త్ ఇష్యూస్ వచ్చాయి. క్రిస్పీ వెర్షన్ రెడీ చేసిన తర్వాత మళ్లీ రీషూట్‌కి వెళ్లారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీంతో వాయిదా పడుతుందని అంటున్నారు.

మ‌రోవైపు మ్యూజిక్ మాస్ట్రో అనిరుధ్ (Anirudh) తన వర్క్ కోసం కాస్త ఎక్కువ టైమ్ కావాలని అడిగాడని తెలుస్తోంది. దీంతో కింగ్‌డమ్ జూలై 4న రిలీజ్ కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంట‌ర్న‌ల్ టాక్ ప్ర‌కారం.. ఆగస్ట్‌కి వాయిదా పడొచ్చని తెలుస్తోంది. ఈ యాక్షన్ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీపై విజ‌య్‌కు భారీ ఆశ‌లు ఉండ‌గా.. ఫ్యాన్స్‌కు అంత‌కు మించిన అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పుడు వాయిదా పడుతుందన్న వార్తతో నిరాశపడుతున్నారు రౌడీ ఫ్యాన్స్

ఇదిలా ఉంటే జోరుగా వినిపిస్తున్న వాయిదా వార్తలకు నిర్మాత నాగవంశీ (Naga Vamsi) చెక్ పెట్టాడు. ఫేక్ వార్తలను నమ్మొద్దని అనుకున్న టైం కే సినిమా రిలీజ్ అవుతుందన్నారు. అనుకున్నట్టుగా 'కింగ్ డమ్' జూలై 4న జనం ముందుకు వస్తే విజయ్ ఫ్యాన్స్ కు ఆనందం రెట్టింపవుతుందని చెప్పొచ్చు.

Updated Date - Jun 05 , 2025 | 05:29 PM