Deshapathi Srinivas: దిల్ రాజు కల్లు కంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకో
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:50 PM
Deshapathi Srinivas: నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి పండుగకు ఆంధ్రాలా తెలంగాణలో వైబ్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయి' అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' సినిమాకి టికెట్ల ధర పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీంతో తెలంగాణలో రాజకీయం దుమారం రేగుతోంది.
ఇటీవల వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి పండుగకు ఆంధ్రాలా తెలంగాణలో వైబ్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయి' అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' సినిమాకి టికెట్ల ధర పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీంతో తెలంగాణలో రాజకీయం దుమారం రేగుతోంది.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమ సాహిత్యకారుడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "అయ్యా దిల్ రాజు తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకో. వైబ్ కావాలంటే కల్లు కంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకో. దిల్ రాజు ఏనాడు తెలంగాణ వ్యక్తిలా వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సినిమా టికెట్ల ధరలు పెంచమన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ధరల పెంపు పై ప్రజలకు సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణీ మరోసారి బయటపడింది. గేమ్ ఛేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చారు" అంటూ ఆయన మండిపడ్డారు.
కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాకు జనవరి 10వ తేదీ ఒక్కరోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం, జనవరి 11 నుంచి జనవరి 19వ తేదీ వరకు 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది. జనవరి 10 తేదీన నిర్వహించే 6 షోలకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఆ ఒక్క రోజు మల్టీప్టెక్స్ థియేటర్లలో రూ. 150, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి జారీ చేసింది. జనవరి 11 నుండి జనవరి 19 వరకు 9 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ. 100 రూపాయలు పెంచుకునేలా వెసులు బాటుని కల్పించిన ప్రభుత్వం.. ఎటువంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో నార్కోటిక్, డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది.