Thammudu: ఇదెక్కడి మాస్ రా మామ! తమ్ముడు.. రిలీజ్‌కు ముందే రిటర్న్స్
ABN , Publish Date - Jun 27 , 2025 | 08:22 AM
నితిన్, దిల్ రాజుల చిత్రం తమ్ముడు విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి చేరినట్లు తెలుస్తుంది.
నితిన్ (Nithiin) హీరోగా వకీల్ సాబ్, MCA, చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వం వహించిన చిత్రం తమ్ముడు (Thammudu). కాస్త విరామం తర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda), లయ (Laya), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా, స్వసిక కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మూవీ జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు పుల్ స్వింగ్‌లో చేస్తున్నారు. అయితే సినిమాకు మరీ హైప్ ఇవ్వకుండా, కత గురించి ఎక్కడా మరీ ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తగా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. ఈ చిత్రం విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి చేరినట్లు తెలుస్తుంది. సుమారు రూ.70 కోట్ల వరకు బడ్జెట్‌తో తెరకెక్కగా చిత్రీకరణ సమయంలోనే హీరో, దర్శకుడు తమ రెమ్యునరేషన్లలో కాస్త తగ్గించుకోవడం ఆ విషయాన్ని వారు బహిరంగంగా చెప్పి మరి సినిమాను వార్తల్లో నిలిచేలా చేశారు. కాగా.. కరోనా సమయంలో నానితో తీసిన వీ సినిమాను అమెజాన్‌లో డైరెక్ట్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన దిల్ రాజు మొదటి నుంచి ఆ తర్వాత కూడా తన ప్రతీ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కు మాత్రమే ఇస్తూ మంచిగానే రికవరీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తన కొత్త చిత్రం తమ్ముడు విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం చేతిలో పెట్టడం ఆశ్చర్యం కలిగించింది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకోగా, ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ ఇలా నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి రూ.38 కోట్ల మేర రికవరీ అయినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ రూ.75 కోట్లలో ముందే సగం పూడడంతో మేకర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక థియేటర్లో విడుదలై మూవీ ఓ మోస్తరుగా ఉందని టాక్ వచ్చినా పెట్టిన పెట్టుబడిని మించి లాభాల బాట పట్టి నితిన్‌కు, దిల్ రాజుకు మంచి హిట్ పడ్డట్టేనని అనుకుంటున్నారు. దీంతో మొత్తానికి తమ్ముడు (Thammudu) సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలిమరి.. విడుదల తర్వాత తమ్ముడు ఎంతమేరకు బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతారో అంటూ సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.