LORVEN AI STUDIO: అంతర్డాతీయ స్థాయిలో.. దిల్ రాజు లార్‌వెన్ ఏఐ కంపెనీ
ABN, Publish Date - May 03 , 2025 | 09:25 PM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో కలిసి అంతర్డాతీయ స్థాయిలో లార్‌వెన్ ఏఐ ఆధారిత మీడియా కంపెనీ (ఏఐ స్టూడియో)ని శనివారం ప్రారంభించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో కలిసి అంతర్డాతీయ స్థాయిలో లార్‌వెన్ ఏఐ (LorvenAIStudio) ఆధారిత మీడియా కంపెనీ (ఏఐ స్టూడియో)ని శనివారం ప్రారంభించారు. జేఆర్సీ కన్వెషన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, అల్లు అరవింద్, దర్శకులు రాఘవేంద్రరావు, నాగ్ అశ్వీన్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా స్టూడియో లోగోను నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించగా, ‘లార్వెన్ ఏఐ’ స్టూడియోను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు సతీమణి మాట్లాడుతూ.. లార్‌వెన్ అంటే లార్డ్ వేంకటేశ్వర అని ఏఐలో వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయని కంపెనీ లోగో గురించి వివరించారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితమే ఏఐ స్టూడియో తీసుకు రావాలనిఆలోచన వచ్చిందని ఈ క్రమంలో ‘క్వాంటమ్ ఏఐ’ను కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సినిమా విషయంలో ఏఐ ఎంతగా ఉపయోగపడుతుందో చర్చించామన్నారు. ఈమేరకు ఓ వీడియోను సైతం రిలీజ్ చేశారు.
ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుందని తెలిపారు. స్క్రిప్టు పూర్తయితే.. ఏఐ ద్వారా సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్‌తో సినిమా చూడొచ్చని వెళ్లడించారు. రానున్న కాలంలో అనేక మార్పులు వచ్చి ఏఐ ద్వారా సినిమాల సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. దర్శక, రచయితలకు సమయం, నిర్మాతలకు డబ్బు ఆదా అవుతుంది. దాంతో మరిన్ని చిత్రాలు రూపొందించ వచ్చని అన్నారు. ఎమోషన్స్‌లేని అసిస్టెంట్ డైరెక్టర్ అవుతుందని దిల్‌రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ LORVEN AI లో వర్క్ చేస్తున్నాడని అన్నారు.
ALSO READ: Allu Arjun: అల్లు అర్జున్.. మొదలేట్టేశాడుగా! ఇక రచ్చ రచ్చే