Dil Raju - Nithin: నితిన్ నువ్వు ఆ స్థాయికి రాలేదు.. నిర్మొహమాటంగా చెప్పిన దిల్ రాజు
ABN , Publish Date - Jun 30 , 2025 | 06:43 PM
తమ్ముడు సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్, దిల్‌రాజుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
నితిన్ సినీ జర్నీ గురించి ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా చెప్పారు నిర్మాత దిల్ రాజు. నితిన్ హీరోగా ఆయన నిర్మించిన 'తమ్ముడు' జులై 4న(Thammudu Release date)ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్,దిల్‌రాజుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.  ‘దిల్’తో నిర్మాత అయిన రాజు దానినే ఇంటి పేరుగా మార్చుకున్నారు.  ఈ సందర్భంగా నితిన్ అడిగిన ప్రశ్నకు ముక్కుసూటిగా  సమాధానంఇచ్చారు. ‘దిల్’కీ‘తమ్ముడి’కీ మధ్యలో నితిన్‌లోచూసిన మార్పులేంటి?  ప్లస్,మైనస్‌లు రెండూచెప్పండి’’ అని నితిన్ ప్రశ్నించగా  ‘‘నటుడిగా 22 ఏళ్లు సుదీర్ఘ జర్నీ చేశావు.  నాకంటే చిత్ర పరిశ్రమలో  ఒక సంవత్సరం సీనియర్‌వి.  నువ్వు 2002లో హీరో అయితే,  నేను 2003లో నిర్మాతని  అయ్యా. నీకు నాకూ అనుభవం వచ్చింది.  నాకు ఎలాగైతే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చిందో నీకు అలాగే వచ్చింది.నీకంటే జూనియర్‌నిఅయినా, కెరీర్‌లోఒక్కోటి సాధించుకుంటూ ఈ స్థాయికి వచ్చా.  నిన్ను  కూడాఅలాగే ఊహించుకున్నా.ఎందుకంటే ‘దిల్’తీసేటప్పుడు నువ్వు..‘ఆర్య’ చేసేటప్పుడుఅల్లు అర్జున్‌లు ఫ్యూచర్‌స్టార్స్ అని నేను భావించాను. నువ్వు మాత్రం ఆ మార్కును సాధించలేకపోయావు’’అని చెప్పారు దిల్ రాజు 
మధ్యలో నితిన్ అందుకుంటూ..‘తమ్ముడి’తో పూర్వవైభవం వస్తుందా? అనిఅడగ్గా, ‘ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరో అవుతావు. ఇది సరిపోదు. కొడితే‘ఎల్లమ్మ’తో కొట్టాలి’ అని దిల్‌రాజు సమాధానం ఇచ్చారు. ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ రానుంది. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇక నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 4న విడుదల కానుంది.