Dil raju: 'అర్జున'.. పవన్ కోసమా..
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:35 PM
నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈమధ్య స్పీడు తగ్గించాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఆయన.. ఎప్పుడైతే FDC చైర్మన్ అయ్యాడో.. అప్పటినుంచి సినిమాలోపై ఫోకస్ చేయడం లేదని టాక్ నడుస్తోంది.
Dil raju: నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈమధ్య స్పీడు తగ్గించాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఆయన.. ఎప్పుడైతే FDC చైర్మన్ అయ్యాడో.. అప్పటినుంచి సినిమాలోపై ఫోకస్ చేయడం లేదని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు.. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా దేవిశ్రీ ప్రసాద్ తో ఎల్లమ్మ ఒకటి చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.
ఎప్పటినుంచో దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలనీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రీఎంట్రీ వకీల్ సాబ్ తో మంచి విజయాన్ని అందుకున్న దిల్ రాజు.. ఆ తరువాత మరో సినిమా చేయలేదు. ఓజీ తరువాత పవన్ తో హార్ట్ కింగ్ ఒక సినిమా చేయాలనీ.. ఆయన డేట్స్ కోసం తిరుగుతున్నాడని టాక్ వచ్చింది. అంతేకాకుండా పవన్ కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న పవన్.. తరువాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయనున్నాడని రూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే దిల్ రాజు.. అర్జున అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. అందరూ ఈ టైటిల్.. విజయ్ దేవరకొండ కోసమే అని చెప్పుకొస్తున్నారు. కానీ, ఈ పవర్ ఫుల్ టైటిల్ పవన్ కోసమే రిజిస్టర్ చేయించాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మైథలాజికల్ నేపథ్యంలో సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్న నేపథ్యంలో పవన్ సైతం ఆ కాన్సెప్ట్ టోన్ సినిమా చేయాలనీ చూస్తున్నాడట. దానికోసమే ఈ టైటిల్ ని ఎంచుకున్నారని సమాచారం. టైటిల్ బావుంది.. నిర్మాత కూడా సెట్.. మరి పవన్ ని అర్జునగా చూపించే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఎవరు.. అది వర్క్ అవుట్ అవుతుందా.. అనేది తెలియాల్సి ఉంది.