Dhanush: 'కుబేర' నాకు చాలా స్పెషల్ చిత్రం.. శేఖర్ చాలా మంచి మనిషి

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:50 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush).. సార్(SIR) సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Kuberaa

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush).. సార్(SIR) సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ చేస్తున్న రెండో తెలుగు సినిమా కుబేర(Kuberaa). శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన రశ్మిక(Rashmika) నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున(AkkinenI Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే జూన్ 20 న కుబేర రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి పీపీ డుమ్ డుమ్ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు.ఈ వేడుకకు ధనుష్, నాగార్జున, రష్మికతో పాటు చిత్ర బృందం హాజరయ్యింది.

ఇక ఈవెంట్ వేదికపై ధనుష్ మాట్లాడుతూ.. " కుబేర నాకు చాలా స్పెషల్ చిత్రం. ఈ సినిమాలో నేను బెగ్గర్ గా కనిపిస్తాను. ఆ పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశాను. రోడ్ల మీద తిరిగాను. బాగా కష్టపడ్డాను లాంటి మాటలు నేను చెప్పను. ఎందుకంటే అవేమి నేను నేర్చుకోలేదు. డైరెక్ట్ గా షూట్ కి వెళ్లాను. మా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏది చెప్తే అదే చేశాను. ఆయన చాలా మంచి మనిషి. మొదటిసారి నేను ఆయనను కలిసినప్పుడు నాకు 20 నిముషాలు స్క్రిప్ట్ చెప్పారు. వెంటనే నేను ఓకే చెప్పేశాను. శేఖర్ ఎప్పుడు చాలా పాజిటివ్ గా ఉంటారు.

ఇక ఈ సినిమాలో అందరితో కలిసి నటించడం చాలా అద్భుతంగా అనిపించింది. రశ్మికతో కలిసి నేను 7 గంటలు డంపింగ్ యార్డ్ లో షూటింగ్ చేసాం. నాకు అలవాటు అవ్వడానికి కొద్దిగా టైమ్ పట్టింది. కానీ, రశ్మిక మాత్రం అక్కడ ఉన్నంతసేపు ఏమి అవ్వలేదు. నాకు ఎలాంటి వాసన రాలేదు అని చెప్పింది. మరి ఆమెకు ఏమైందో అనేది నాకు తెలియదు. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను పంచింది ఈ సినిమా. జూన్ 20 న కుబేర రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది " అని చెప్పుకొచ్చాడు.

Updated Date - Jun 10 , 2025 | 06:50 PM