Dhanush: చిరంజీవి కాళ్లు మొక్కిన ధనుష్..
ABN , Publish Date - Jun 22 , 2025 | 09:28 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. సార్ సినిమాతో తెలుగుకు పరిచయమయ్యాడు.

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. సార్ సినిమాతో తెలుగుకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నధనుష్.. ఇప్పుడు కుబేర (Kuberaa) సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రష్మిక(Rashmika) హీరోయిన్ గా నటించింది. జూన్ 20 న ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కుబేర భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ధనుష్ నటనకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది.
ఇక కుబేర భారీ విజయాన్ని అందుకోవడంతో మేకర్స్.. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. శేఖర్ కమ్ములకు - చిరుకు మధ్య ఎంతో మంచి స్నేహం ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడంతో చిరు.. ఆయనను సన్మానించాడు. ఇక ఆ స్నేహం కారణంగానే చిరు.. ఈ సక్సెస్ మీట్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక కుబేర సక్సెస్ మీట్ లో ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. ధనుష్ ఈవెంట్ లోకి అడుగుపెట్టగానే అందరినీ పలకరిస్తూ వచ్చాడు. చిరును చూడగానే ఆయన గౌరవంతో కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే చిరు, ధనుష్ ను లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం కుబేరలోని ధనుష్ నటనపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంకోపక్క చిరు - నాగ్ ఒకే స్టేజిపై కనిపించడంతో మ్యూచువల్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం న్యూ లుక్.. ఆయన ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా.. ?