Dhandoraa Teaser: చావు చుట్టూ తిరిగే కథ.. ఆసక్తి రేపుతున్న దండోరా టీజర్

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:44 PM

బిగ్ బాస్ శివాజీ(Shivaji), నవదీప్(Navadeep), నందు (Nandhu), రవి కృష్ణ, బిందు మాధవి, మౌనికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం దండోరా(Dhandoraa).

Dhandoraa

Dhandoraa Teaser: బిగ్ బాస్ శివాజీ(Shivaji), నవదీప్(Navadeep), నందు (Nandhu), రవి కృష్ణ, బిందు మాధవి, మౌనికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం దండోరా(Dhandoraa). మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా దండోరా సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. పాత్రలను పరిచయం చేయలేదు కానీ, అన్ని పాత్రలను మాత్రం చూపించారు. కథ మాత్రం ఒక చావు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. శివాజీ.. ఊర్లో పెద్ద మనిషిగా కనిపించగా.. నవదీప్ సర్పంచ్ గా.. బిందు మాధవి ఒక వేశ్యగా కనిపించి షాక్ ఇచ్చింది. ఒక ఊరు వదిలి పట్నం వచ్చి జాబ్ చేసే జంటగా నందు, మౌనిక రెడ్డి కనిపించారు. ఆ చావు ఎవరిది.. ? చివర్లో శవాన్ని వంతెన నుంచి కిందపడేయడం ఏంటి.. ? అసలు ఈ పాత్రలకు ఆ శవానికి సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

టీజర్ ను బట్టి ఇదొక ఎమోషనల్ విలేజ్ డ్రామా అని తెలుస్తోంది. శివాజీ పాత్ర మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన లుక్, నటన, డైలాగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా శివాజీ చావు గురించి చెప్పిన డైలాగ్ అయితే టీజర్ కే హైలైట్ గా నిలిచింది. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 17 , 2025 | 04:44 PM