Dhandoraa: అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగితే..   

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:23 PM

‘దండోరా’ (Dhandoraa) ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు

Dhandoraa Movie

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి గుర్తింపు పొందారు  లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని (Benerji). తాజా ఆయన నిర్మిస్తున్న చిత్రం 'దండోరా' (Dhandoraa). దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్‌ ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ ఖాళీ ప్రాంతంలో త‌వ్విన గొయ్యి కనిపిస్తోంది. అందులో 'ఈ ఏడాదికి డ్రామ‌టిక్‌గా ముగింపునిస్తున్నాం' అనే క్యాప్ష‌న్‌తో మూవీని డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

సామాజిక స్పృహను కలిగించే అంశంతో, అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు..ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.  పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి  పిక్చ‌ర్స్ సినిమాను ఓవ‌ర్‌సీస్ రిలీజ్ చేస్తోంది. 

Updated Date - Nov 10 , 2025 | 04:03 PM