Devi Sri Prasad: 'ఎల్లమ్మ' అదిరిపోయే ట్విస్టు.. హీరోగా దేవీ శ్రీ ప్రసాద్
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:26 AM
బలగం వంటి సూపర్ సక్సెస్ తర్వాత వేణు ఎల్లమ్మ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
బలగం (Balagam) వంటి సూపర్ సక్సెస్ తర్వాత వేణు (Venu Yeldandi) ఎల్లమ్మ (Yellamma) అనే మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మిస్తోండగా ఎడాదిన్నరగా హీరో విషయంలో తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. నాని, నితిన్, శర్వానంద్, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా నలుగురైదుగురు పేర్లు తెరమీదకు వచ్చి పోవడం జరిగిపోయాయి. ఇక కథానాయుకల విషయంలోనూ సాయి పల్లవి, కీర్తి సురేశ్‌ల మధ్యే చర్చలు నడుస్తున్నట్లు వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి.
అయితే.. తాజాగా ఈ స్థానంలోకి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పేరు రావడం సినీ లవర్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హాల్‌చల్ చేస్తోంది. అంతేగాక ఈ సినిమాకు దేవీనే సంగీతం కూడా అందించనున్నట్లు సమాచారం.ఇప్పటికే డ్యాన్స్, నటనలోనూ దేవీకి అద్భుత ప్రతిభ ఉంది. అయితే ఈ వార్తల విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే లేదు. మేకర్స్ , దర్శకుడు వేను, దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్ స్వయంగా స్పందిస్తే తప్పా ఈ వార్తలపై క్లారిటీ రాదు.
ఇదిలాఉంటే.. కుమారి 21ఎఫ్ సినిమా సమయంలో దేవి శ్రీ ప్రసాద్‌ని నా ఎస్వీసీ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేస్తాను అని దిల్ రాజు గతంలోనే మాట ఇచ్చాడు. కానీ దశాబ్దం గడిచినా అది ముందుకు పడలేదు. ఇప్పుడు ఈ చిత్రంతో అటు వేణు, ఇటు డీఎస్పీ ఇద్దరిని కలిపి సినిమా తీస్తే దిల్ రాజు ఇచ్చిన మాట కూడా నేరవేరినట్లే అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే దిల్ రాజు డైరెక్టర్ వీవీ వినాయక్‌ను హీరోగా పెట్టి మధ్యలో ఆగిపోయిన శీనయ్య సినిమా లాగా కాకపోతే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మున్ముందు ఈ ఎల్లమ్మ సినిమా విషయంలో ఎలాంటి వార్తలు వస్తాయో ఎదురు చూడాలి.