Krishna Leela: ప్రేమించడం, ప్రేమించబడటం.. రెండూ కర్మలే! కృష్ణ‌లీల ట్రైల‌ర్

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:47 PM

స్వీయ దర్శకత్వంలో దేవన్ (Devan) హీరోగా రూపొందుతున్న సూపర్‌ నేచురల్‌ లవ్‌ స్టోరీ ‘కృష్ణ లీల’ .

Krishna Leela

స్వీయ దర్శకత్వంలో దేవన్ (Devan) హీరోగా రూపొందుతున్న సూపర్‌ నేచురల్‌ లవ్‌ స్టోరీ ‘కృష్ణ లీల’ (Krishna Leela ). ధన్యబాలకృష్ణన్ (Dhanya Balakrishnan) కథానాయిక. బేబీ వైష్ణవి సమర్పణలో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

‘ప్రేమించడం, ప్రేమించబడటం.. రెండూ కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా, అది మరింత కాంప్లికేటెడ్‌ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు’ అనే పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో చిత్రం తెర‌కెక్కింది. సీనియ‌ర్ న‌టులు వినోద్ కుమార్‌, బ‌బ్లూ ఫృథ్వీ, తుల‌సిల‌తో పాటు సెవ‌న్ ఆర్ట్స్ స‌ర‌యు, ర‌వి కాలే, ఆనంద్ భ‌ర‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.

ట్రైల‌ర్‌ను చూస్తే.. మేక‌ర్స్ ఏదో కొత్త‌ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ద‌ర్శ‌క‌త్వంతో పాటు హీరోగా చేసిన దేవ‌న్ రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌నుండ‌డం విశేషం. గ‌త జ‌న్మ‌లో విఫ‌లం అయిన ప్రేమ కోసం ప్ర‌స్తుత జ‌న్మ‌లో ప్రేమికుడి ఆరాటం నేప‌థ్యంగా సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

Updated Date - Oct 27 , 2025 | 01:16 PM