Devagudi: తిరుమలలో సందడి చేసిన దేవగుడి టీమ్..

ABN , Publish Date - Nov 29 , 2025 | 08:15 PM

అభినవ్ శౌర్య (Abhinav Shouryav), అనుశ్రీ(Anu Shri) జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి (Devagudi).

Devagudi: అభినవ్ శౌర్య (Abhinav Shouryav), అనుశ్రీ(Anu Shri) జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి (Devagudi). ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం తిరుపతి, గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో సందడి చేసింది. అక్కడ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం కళాశాలలో ప్రదర్శించారు.

ఇక ఈ వేదికపై హీరో అభినవ్ శౌర్యవ్ మాట్లాడుతూ.. హీరో కావాలని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని కోరాడు. దేవగుడి సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని అందరూ ఈ సినిమాను మెచ్చుకుంటారని చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ అనుశ్రీ సినిమాలోని డైలాగ్స్ చెప్పి అలరించింది. సినిమాలో ఓ పాటకు హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేసి అలరించారు.

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19 విడుదల కానుందని, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 29 , 2025 | 08:15 PM