Pawan Kalyan: 96 ఏళ్ల అభిమానికి.. స్వ‌యంగా అన్నం వ‌డ్డించి క‌లిసి భోజ‌నం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ABN, Publish Date - May 09 , 2025 | 09:14 PM

అంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) త‌నలోని సింప్లిసిటీని మ‌రోమారు నిరూపించుకున్నారు.

pawan kalyan

అంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) త‌నలోని సింప్లిసిటీని మ‌రోమారు నిరూపించుకున్నారు. ఇది క‌దా రాజ‌కీయ‌నాయ‌కుడంటే, ఇది క‌దా అప్యాయ‌త అని ప్ర‌పంచానికి చూపాడు. పిఠాపురం నియోజకవర్గం (Pithapuram constituency) యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు (Potula Perantalu) తో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం భోజనం చేశారు.

పవన్ కల్యాణ్ మీద అభిమానంతో గ‌డిచిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని కొరుకుని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని పేరంటాలు మొక్కుకుంది. అందు కోసం తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి రూ.27వేలతో గరగ చేయించి సమర్పించింది కూడా.

అయితే.. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు (శుక్ర‌వారం) పేరంటాలును తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని కలిసి భోజనం చేశాడు. ఆయ‌నే స్వ‌యంగా అడిగి మ‌రి వ‌డ్డిస్తూ, యోగ క్షేమాలు మాట్లాడుకుంటూ ఆప్యాయంగా ఇద్ద‌రు క‌లిసి భోజ‌నం చేశారు.

ఆపై పవన్ కల్యాణ్ ప్ర‌త్యేకంగా ఓ చీరను, రూ. లక్ష నగదును పేరంటాలుకు అందించారు. అనంత‌రం పఫొటోలు దిగి ఇంటి బ‌య‌టి వ‌ర‌కు వ‌చ్చి ఆమెను సాగ‌నంపారు. దీంతో తను అభిమానించే పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలవడంపై పోతుల పేరంటాలు (Potula Perantalu) సంతోషం వ్యక్తం చేస్తూ అక్క‌డి నుంచి వెళ్లి పోయింది.

Updated Date - May 09 , 2025 | 09:22 PM