Ustaad Bhagat Singh: పవన్ స్టెప్పేస్తే భూకంపం.. సాంగ్ ప్రోమో అదిరిపోయిందంతే

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:42 PM

ఈ మధ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్టైలిష్ గా కనిపిస్తున్నాడా.. లేక ఆయనను చూపించే డైరెక్టర్స్ అందరూ అలా చూపిస్తున్నారో తెలియడం లేదు కానీ, ఓజీ సినిమా నుంచి పవన్ లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ఈ మధ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్టైలిష్ గా కనిపిస్తున్నాడా.. లేక ఆయనను చూపించే డైరెక్టర్స్ అందరూ అలా చూపిస్తున్నారో తెలియడం లేదు కానీ, ఓజీ సినిమా నుంచి పవన్ లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఓజీ తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హారీష్ శంకర్ ( Harish Shankar)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఉస్తాద్ రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. తాజాగా దేఖ్ లెంగే సాలా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక పవన్ స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో బద్రి టైమ్ లోనే అందరికి తెలుసు. ఈ మధ్యకాలంలో పవన్ సాంగ్స్ కు స్టెప్స్ వేయడం తగ్గించాడు. కానీ, ఈసారి హరీష్.. పవన్ ని ఒప్పించి మరీ స్టెప్పులు వేయించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ప్రోమోలో బ్లాక్ సూట్ లో పవన్ హుక్ స్టెప్ వేస్తుంటే ఫ్యాన్స్ కళ్లు మతాబుల్లా వెలిగిపోతున్నాయి అని చెప్పొచ్చు. ఓజీలో మాస్ గా కనిపించిన పవన్.. ఈ సాంగ్ లో చాలా క్లాస్ గా స్టైలిష్ గా కనిపించాడు.

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోకి ఫ్యాన్స్ ఉంటే .. పవన్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబోలో హిట్ సినిమాలే ఎక్కువ. ఇక ఉస్తాద్ కోసం మరోసారి దేవిశ్రీ రంగంలోకి దిగాడు. ఇక సాంగ్ ప్రోమోలో దేవిశ్రీ మార్క్ కనిపిస్తుంది. ఫుల్ జోష్ లో సాగే సాంగ్ లా అనిపిస్తుంది. రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం అంటూ సాగే లిరిక్స్ ని భాస్కరభట్ల అందించాడు. దేఖ్ లెంగే సాలా ఫుల్ సాంగ్ డిసెంబర్ 13 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో హరీష్ - పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్.. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ని అందుకుంటారో లేదో చూడాలి.

Updated Date - Dec 09 , 2025 | 06:53 PM