KA Movie: ‘క’ చిత్రానికి అరుదైన గౌరవం
ABN , Publish Date - May 02 , 2025 | 11:56 AM
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘క’ (KA movie) చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘క’ (KA movie) చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించే ‘దాదా సాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke Award) ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. దీంతో సినిమా టీమ్‌కు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. నయన్ సారిక, తన్వీ రామ్ నాయికలు. గతేడాది విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని రూ.50 కోట్లు వసూళ్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. డాల్‌బీ విజన్: ఆటమ్స్ టెక్నాలజీలతో తెరకెక్కించారు.
కథ విషయానికొస్తే.. అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. తన సొంత వాళ్లే రాశారని ఊహించుకుంటూ జీవితాన్ని గడిపే వ్యక్తి. అలా ఓ రోజు ఉత్తరం చదువుతుండగా ఆ ఊళ్లో కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి ఓ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. వాటిని అతను ఎలా అధిగిమించాడు. కొందరు అమ్మాయిలు మిస్ అవ్వడం వెనకున్న మిస్టరీ ఏంటి అన్నది కథ. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘క 2’ ఉంటుందని దర్శక ద్వయం ఇప్పటికే ప్రకటించారు. మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్ మరింత ఉత్కంఠగా ఉంటుందని టీమ్ తెలిపింది.