Film Chamber Elections: ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:20 PM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో (telugu film chamber elections) నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో (telugu film chamber elections) నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ బలాన్ని నిరూపించుకుంది. నూతన కార్య వర్గాన్ని సి. కళ్యాణ్ వెల్లడించారు. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు.
కార్యదర్శిగా అశోక్ కుమార్, కేవీవీ ప్రసాద్ (విజయవాడ), ఉపాధ్యక్షులుగా సూర్య దేవర నాగవంశీ, భరత్ చౌదరి ఎన్నికవగా, కోశాధికారిగా ముత్యాల రామదాసులు గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్‌రెడ్డి, జి.వీరనారాయణబాబు (విజయవాడ) మహేశ్వర్‌రెడ్డి (గుంతకల్), నాగార్జున (తిరుపతి), కె.అప్పలరాజు (విశాఖపట్నం) విజయం సాధించారు.
తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌లో మొత్తం 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.